అనంతపురం జిల్లాలోని బుక్కారాయసముద్రం మండల కేంద్రంలోని ఇస్లాంపురం కాలనీకి చెందిన షేక్ హుస్సేన్(12) అనే బాలుడు హెచ్ఎల్సీ కాలువలో పడి గల్లంతయ్యాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలుడు మధ్యలో సరదా కోసం వెళ్లి ప్రమాదావశాత్తు కాలువలో పడ్డాడు. తోటి పిల్లలు.. గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడి ఆచూకీ కోసం కాలువ వెంబడి గాలిస్తున్నారు .
ఇదీ చదవండి: భూవివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం