క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘట్టమనేని సుభాస్ చంద్రబోస్ అనే వ్యక్తి మరో ఇద్దరి సహాయంతో బెంగుళూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహించేవాడు. ఆయితే.. అక్కడ పోలీసుల నిఘా పెరగటంతో అనంతపురం శివారుకు మకాం మార్చాడు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. వీరు వివిధ బ్యాంకుల్లో 90 ఖాతాలు తెరిచి, బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిల్లో.. రూ.2.37 కోట్లు నిల్వ ఉన్నట్టు తేల్చారు. ఆ నగదును సీజ్ చేశారు. నిందితులు క్రికెట్ బెట్టింగ్తోపాటు గంజాయి విక్రయం కూడా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుల సమాచారం మేరకు 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ రాంమోహన్ రావు వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: Cricket betting: క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడులు.. 13 మంది అరెస్ట్