ఇంటి వద్దకే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కదిరిలో ఫిబ్రవరి 1న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పర్యవేక్షించారు. కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ , ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఉన్నతాధికారులతో కలిసి.. పరిశీలించారు. ఆర్డీవో వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డీఎస్పీ భవ్యకిశోర్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.
ఇదీ చూడండి: