అనంతపురం జిల్లా ఉరవకొండలో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని సీపీఐ నాయకులన్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నా.. పాత పైపులైన్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది అని వారు తెలిపారు. ఒక పక్క హంద్రీనీవా ద్వారా మరోపక్క హోస్పేట్ డ్యాం నుండి నీరు వస్తున్నా... వాటిని వినియోగించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటిని నిల్వ చేసి... ఉపయోగించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. అధికారులు వెంటనే నీటి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
ఇవీ చదవండి