అనంతపురం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 269 అత్యంత సమస్యాత్మక, 374 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు ఎస్పీ సత్యఏసుబాబు చెప్పారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమీక్ష అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘాపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ తరహా వ్యక్తులను 12 వేల మందిని బైండోవర్ చేశామన్నారు. వారిపై నిఘా పెట్టామని, తీరు మారకపోతే కఠినంగా వ్యవహరించేలా ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.
జిల్లాలో 3600 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. 8 సబ్ డివిజన్లలోని 83 పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎస్ఈసీకి వివరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం