Rod Marsh: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కన్నుమూశారు. బౌలర్ డెన్నిస్ లిల్లీతో కలిసి ఎన్నో అద్వితీయ వికెట్ల భాగస్వామ్యం నెలకొల్పిన అతడు.. గుండెపోటు వచ్చిన వారం రోజుల అనంతరం అడిలైడ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.
1970 నుంచి 1984 వరకు 96 టెస్టులు ఆడాడు మార్ష్. టెస్టుల్లో 355 వికెట్ల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పాడు. అందులో 95 లిల్లీ బౌలింగ్‌లోనే. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన వికెట్‌కీపర్‌గానూ గుర్తింపు పొందాడు మార్ష్.
ఆస్ట్రేలియా సెలక్టర్స్ ఛైర్మన్‌గానూ సేవలందించారు రాడ్ మార్ష్. 1985లో స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కించుకున్నారు.
ఇదీ చూడండి: రష్యాకు మళ్లీ షాక్.. పారాలింపిక్స్ నుంచి ఔట్..