టీ20 క్రికెట్ ఆడటమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ప్రస్తుతం తాను ఉన్నట్లయితే టీ20లకు అనుగుణంగా భారీ షాట్లను కొట్టేందుకు తన ఆట తీరును మార్చుకునేవాడినని అన్నాడు. టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో ట్విట్టర్ లైవ్‌లో మాట్లాడిన గంగూలీ.. వీటితో పాటే అనేక విషయాలు పంచుకున్నాడు.
-
T20 is a very important format and I would've definitely played it 😊 @SGanguly99 on #DadaOpensWithMayank https://t.co/xmjKFlo0HM pic.twitter.com/dpbq1W6y1T
— BCCI (@BCCI) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T20 is a very important format and I would've definitely played it 😊 @SGanguly99 on #DadaOpensWithMayank https://t.co/xmjKFlo0HM pic.twitter.com/dpbq1W6y1T
— BCCI (@BCCI) July 5, 2020T20 is a very important format and I would've definitely played it 😊 @SGanguly99 on #DadaOpensWithMayank https://t.co/xmjKFlo0HM pic.twitter.com/dpbq1W6y1T
— BCCI (@BCCI) July 5, 2020
"టీ20 ఎంతో ముఖ్యమైన ఫార్మాట్. ఐపీఎల్లో మొదటి ఐదేళ్లు ఆడాను కానీ ఇప్పుడు ఉండుంటే, కచ్చితంగా నా ఆటతీరు మార్చుకునేవాడని. మైదానంలో బౌలింగ్ చేసేందు, బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపరిచేందుకు టీ20 ఓ లైసెన్స్లాంటింది. ఈ ఫార్మాట్ అంటే నాకు చాలా ఇష్టం"
సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
2002 నాట్‌వెస్ట్ ఫైనల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. బాల్కనీ నుంచి ఆనందంతో జెర్సీ తీసేసి ఆనందం వ్యక్తం చేసిన సంఘటనను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. "అదొ గొప్ప అనుభూతి. ఇప్పుడు మేమంతా దూరమయ్యాం. కానీ ఆట అంటే ఆరోజు జరిగిందే. ఆ విధంగా గెలిచినప్పుడు.. ఇంకా ఎక్కువ సంబరాలు చేసుకుంటారు. నేను ఆడిన గొప్ప క్రికెట్ మ్యాచ్‌ల్లో అదొకటి" అని గంగూలీ చెప్పాడు.
ఇదీ చూడండి:సఫారీ యువ క్రికెటర్లకు అరుదైన గౌరవం