పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరే కాదు ఆయన ఫొటో చూసిన అభిమానులకు సంతోషమే. సినిమాల్లో కనిపించినా, ప్రత్యేక పాత్రలో మెరిసినా, వేరే సెలబ్రిటీ నోటి నుంచి ఆ పేరు వినిపించినా.. ఫ్యాన్స్‌కు పూనకాలే. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ హీరోకు ఫ్యాన్స్ మద్దతు ఎక్కువే. ఆయనకు సంబంధించిన పాత ఫొటోలు ఏవి వచ్చినా అవి వైరల్‌గా మారిపోతుంటాయి. తాజాగా పవన్‌కు చెందిన ఓ పాత ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని ప్యాన్స్ తెగ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్‌కు కొంత కాలంగా దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ మధ్యనే మళ్లీ కొత్త సినిమాలతో అభిమానులకు సర్ప్రైజ్లు ఇచ్చారు. సోషల్ మీడియాలోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య తన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.