కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని నదిలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఘంటసాల ఠాణా ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని ఇటీవలే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పూజలు చేసి కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. అనంతరం దుర్గాప్రసాద్ బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు.
ఇవీ చూడండి : కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త