ETV Bharat / jagte-raho

భార్యను గొంతు నులిమి చంపిన భర్త

భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్​లో షాహినాయత్​ గంజ్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. భార్య వేధింపులను తట్టుకోలేక హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.

husband-murdered-wife-in-hyderabad
husband-murdered-wife-in-hyderabad
author img

By

Published : Aug 15, 2020, 11:57 PM IST

భర్తపై అనుమానం చివరికి భార్య ప్రాణాలు తీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్​లోని షాహినాయత్ గంజ్ పీఎస్​ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగింది. పీఎస్​ పరిధిలో నివసిస్తున్న రాజు(37) తన భార్య ప్రియ(27)ను గొంతు నులిమి ఆమె చీర కొంగు ముడివేసి హత్య చేశాడు. అనంతరం మంగళ్​హాట్​ పోలీసులకు లొంగిపోయాడు. తన భార్య వేధింపులను తట్టుకోలేక హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.

మంగళ్​హాట్​ పోలీసులు నిందితుడిని షాహినాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భార్య ప్రియ తరచుగా తన భర్త రాజుకు అక్రమ సంబంధం ఉందని తరచుగా వేధించడం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వారి మధ్య చోటు చేసుకుంటూ ఉండేవని తెలిపారు.

ఎప్పటిలాగానే ఈరోజు తెల్లవారుజామున కూడా ప్రియ తన భర్తని అక్రమ సంబంధాలు ఉన్నాయని గొడవ పడడం వల్ల ఆవేశంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. వారికి రెండు సంవత్సరాల పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.