ETV Bharat / crime

ఆగివున్న పాల ట్యాంకర్​ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

author img

By

Published : Nov 11, 2022, 7:22 PM IST

Road accident on Chittoor-Bangalore national highway: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న పాల ట్యాంకర్​ను కారు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road accident on Chittoor
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident on Chittoor-Bangalore national highway: చిత్తూరు జిల్లా బెంగళూరు జాతీయ రహదారిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తవణంపల్లి మండలం కాణిపాక పట్నం వద్ద.. ఆగివున్న పాల ట్యాంకర్​ను కారు ఢీకొనడంతో.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పాల ట్యాంకర్ వెనుక నుంచి కారు అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ గల పాల టాంకర్ ముందుగా వెళుతుండగా.. కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు (KA 53 MH 1858 ) వెనుక వైపు నుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బెంగళూరుకు చెందిన అద్దంకి అశోక్ బాబు, భార్య, కుమారుడు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వర్షం కురుస్తున్న సమయంలో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రం కావడంతో.. మృతుల వివరాలు పూర్తిస్థాయిలో తెలియడం లేదు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఆర్డీవో రేణుక, డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి, సీఐ శ్రీనివాసులు రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తవణంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.