తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఏనుబాములలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో తండ్రి, ఏడేళ్ల కుమారుడు మృతి చెందారు. వ్యవసాయ బావిలో కుమారుడి మృతదేహం లభించగా... పురుగుల మందు తాగి తండ్రి రామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు