ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కడప జిల్లా తొండూరు మండలం అగుడూరులో జరిగింది. గ్రామానికి చెందిన కుల్లాయప్ప, రమణ అనే ఇద్దరు స్నేహితులు. వీరు నిన్న (గురువారం) మధ్యాహ్నం మద్యం తాగి గొడవపడ్డారు. వీరిరువురికి ఇది వరకే కుటుంబ ఘర్షణలున్నాయి. దీంతో వీరి గొడవ కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే సమయంలో వీరితో పాటు కలిసి మద్యం సేవిస్తున్న రమణ మిత్రులు రామకృష్ణ, హరికృష్ణలు.. కుల్లాయప్పను బండరాయితో మోది చంపారు. దీంతో అతను అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కుల్లాయప్ప హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటన స్థలంలో మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. పాత కక్షలతో మిత్రులే ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హనుమంతు తెలిపారు.
ఇదీ చదవండి:
Cyber Crime: సహకార బ్యాంక్‌లో రూ. 1.96కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్
Harassment: మతం మారినందుకు వేధించారు.. వెలేశారు.. చివరికి..!