ETV Bharat / city

కిసాన్ క్రెడిట్ కార్డు లబ్ధిదారులకు బంపర్ ఆఫర్

author img

By

Published : Feb 10, 2020, 9:54 PM IST

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ నెల 24లోపు రుణాలు తీసుకునేవారికి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్​ చార్జీలు ఉండవని తెలిపింది.

kissan credit card
kissan credit card

కిసాన్ క్రెడిట్ కార్డులను రైతులు వినియోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రైతులు, కౌలుదారులు, వ్యక్తులు, సమూహాలు, స్వయం సహాయక బృందాలు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందవచ్చని తెలిపింది. సరళీకృత విధానంలో వీరు రుణాలు ఏడాదికి ఏడుశాతం వడ్డీతో మూడు లక్షల రూపాయిల వరకు పొందే వీలుందని వివరించింది. సకాలంలో రుణాలు చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుందని వివరించింది. రుణ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు లేకుండా ఈ రుణం లభిస్తుందని వివరించింది. పశు సంవర్థక, మత్స్య పరిశ్రమల్లో ఉన్న రైతులకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. ఈనెల 24 లోగా ఈ సదుపాయం వినియోగించుకోవాలని కోరింది.

ఇదీ చదవండి:

తెలంగాణ: ఆగంతకుడి దాడిలో ఇంటర్ విద్యార్థిని హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.