హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీతో ఏపీ ఎక్స్ప్రెస్ తొలి ప్రయాణం ఆరంభమైంది. ఈ ఉదయం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరిన ఏపీ ఎక్సప్రెస్లోని ఒక రేక్‌కు ఈ విధానం అమలు చేశారు. విశాఖ- కొత్త దిల్లీల మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ తరుచూ బోగీలలో ఎదురయ్యే ఏసీ ఇబ్బందులకు ఇక రైల్వే ఉండవని రైల్వే వర్గాలు ప్రకటించాయి. పర్యావరణ హితంగా కొత్త సాంకేతికత వినియోగించామన్నారు. పవర్ జనరేటర్ కార్ల స్థానంలో హెడ్ అన్ జనరేషన్ టెక్నాలజీతో బోగీలలో నిరంతరాయంగా ఏసీలు పనిచేసేందుకు విద్యుత్తు సరఫరా అమర్చారని తెలిపారు. వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ చొరవతో కొత్త టెక్నాలజీ వినియోగానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఒక రేక్కి ఈ విధానం అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన మూడు రేక్‌లకు ఇదే తరహా విధానం అమలు చేస్తామని వాల్తేరు డీఆర్ఎం చేతన్ శ్రీవాస్తవ వెల్లడించారు. వీటితో కర్బన ఉద్గారాలు ఉండవని, వాయు, శబ్ద కాలుష్యం బాగా తగ్గుతాయన్నారు. పర్యావరణ హితంగా నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌కి రెండు పవర్ జనరేటర్ కార్ల స్థానంలో రేక్‌లో మరో రెండు బోగీలను అదనంగా చేర్చేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
ఇదీ చదవండి :