women's day celebrations in ap: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా యలమంచిలిలో జరిగిన మహిళా దినోత్సవ సంబరాలకు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి అతిథిగా హాజరయ్యారు. మహిళలు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. రాజమహేంద్రవరంలో ఆనం కళాకేంద్రం నుంచి పుష్కర్ ఘాట్ వరకు 2K పరుగు నిర్వహించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మహిళా పోలీసులకు సీమంతం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఆవరణలో మహిళా ఉద్యోగులు, కార్పొరేటర్లు ఆటపాటలతో సందడి చేశారు.
ఇదీ చదవండి: Women's day Celebrations: తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...