నిబంధనలు పాటించని వాహనదారులపై విజయవాడ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు . పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 5వేల ఎనిమిది వందల ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కేసులు, 197 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరి నుంచి 18 లక్షల 86 వేల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేశారు. వెయ్యి యాభై మంది వాహనదారులకు, తనిఖీల్లో పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ట్రాఫిక్ డీసీపీ నాగరాజు తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.
ఇవీ చదవండి