ETV Bharat / city

New Districts: 'కొత్త జిల్లాల్లో జేడీఏలు ఉండరు' - ap latest news

No JDA's in new districts: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల్లో సంయుక్త వ్యవసాయ సంచాలకులు(జేడీఏ) ఉండరని.. జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) అనే పేరుతోనే పిలవాలని పేర్కొంది. 26 జిల్లాలకు అనుగుణంగా అక్కడి కార్యాలయాలకు సంబంధించి సిబ్బంది విభజనపైనా ప్రతిపాదనలు తయారయ్యాయి.

there will be no JDA's in new districts in Andhra Pradesh
'కొత్త జిల్లాల్లో జేడీఏలు ఉండరు'
author img

By

Published : Mar 6, 2022, 7:38 AM IST

JDA's in new districts: కొత్త జిల్లాల్లో సంయుక్త వ్యవసాయ సంచాలకులు(జేడీఏ) ఉండరు. జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) అనే పేరుతోనే పిలవాలి. ఉద్యానశాఖలోనూ జిల్లా ఉద్యాన (డీహెచ్‌వో) అధికారి అని పిలుస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాలకు అనుగుణంగా అక్కడి కార్యాలయాలకు సంబంధించి సిబ్బంది విభజనపైనా ప్రతిపాదనలు తయారయ్యాయి. నగరాల్లో సిబ్బంది అవసరం తక్కువని అక్కడ తక్కువమందిని కేటాయించారు. విశాఖ జిల్లాలో 9 మందే ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల పరిధిలోని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త జిల్లాల్లో జనాభా, సర్వీస్‌ ఏరియా, అడ్మిన్‌ యూనిట్‌ ప్రాతిపదికగా సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం సూచించింది.

ప్రస్తుతం ఉన్న జేడీఏలతోపాటు ఆత్మ పీడీలు కూడా ఉన్నారు. దీంతో నాలుగైదు జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు జేడీఏ స్థాయి అధికారులే జిల్లా వ్యవసాయ అధికారులుగా నియమితులయ్యే అవకాశం ఉంది. మిగిలినచోట సీనియర్‌ డీడీఏ స్థాయి అధికారుల్ని నియమిస్తారు. వ్యవసాయశాఖలో రైతు భరోసా కేంద్రం యూనిట్‌గా ప్రతిపాదనలు రూపొందించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌, మండల, గ్రామస్థాయి పోస్టుల్లో మార్పు ఉండదన్నారు. ఉద్యానశాఖలోనూ జిల్లాస్థాయి కార్యాలయాలకు సిబ్బంది కేటాయింపుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ శాఖలో వివిధ విభాగాలతోపాటు సూక్ష్మసేద్యం ప్రాజెక్టుకూ జిల్లాల స్థాయిలో ప్రత్యేక అధికారులు ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఉద్యాన అధికారులతోపాటు ఏపీఎంఐపీ నుంచి ఒక అధికారిని నియమించడమా? ఒకటిగా చేయడమా? అనే విషయమై స్పష్టత లేదు.

ఇదీ చదవండి:

ప్రభుత్వంపై పీఆర్సీ భారం రూ. 3,181 కోట్లే... అశుతోష్‌ మిశ్ర కమిటీ స్పష్టీకరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.