తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోలీసు సంఘం చంద్రబాబుకు వ్యతిరేకంగా లేఖలు రాస్తోందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ తెదేపా హయాంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకొని.., వైకాపా పాలనలో హైకోర్టులో దోషిలా నిలబడ్డారన్నారు. డీజీపీ పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చారని దుయ్యబట్టారు. పోలీసులపై వైకాపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు పోలీస్ అసోసియేషన్ నోరెందుకు మెదపలేదని ఆయన నిలదీశారు. పోలీస్ సంఘాల నేతల తీరు తాడేపల్లి ప్యాలెస్‌కు అమ్ముడుపోయినట్లుగా ఉందని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి
మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్