సూర్యగ్రహణం కారణంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో అన్ని సేవలు, దర్శనాలు రద్దు అయ్యాయి.మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆలయ వైదిక కమిటీ, అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కృష్ణా నదిలో గ్రహణ స్నానాలు నిషేధిస్తూ నగరపాలక సంస్థ ప్రకటన జారీ చేసింది. ఎవరూ నదికి స్నానాలకు రావద్దని కోరింది.
దుర్గమ్మకు ఆషాడ సారె...
సోమవారం నుంచి జులై 20 వరకు దుర్గమ్మకు ఆషాడ సారె సమర్పణ కార్యక్రమం చేపట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాస్కులు ధరించి సారెను అమ్మవారికి సమర్పించేందుకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. రేపు ఉదయం 8.30 గం.కు తొలి సారె శాస్త్రోక్తంగా అమ్మవారికి సమర్పిస్తారు.దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తొలి సారెను అమ్మవారికి సమర్పించనున్నారు.
ఇదీ చదవండి: