ఫిబ్రవరి 1నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరవనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా విద్యాలయాలను నిర్వహిస్తామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు జరుపుతామని పేర్కొన్నారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులనే ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. గదులు సరిపోనిచోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులను అనుమతిస్తామన్నారు.
ఇదీ చదవండి: