విజయవాడలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బుల్లెట్ వాహనాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న 25 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు ప్రత్యేకంగా అమర్చిన సైలెన్సర్లను తొలగించారు. ఇకపై ఎవరైనా.. బైకులతో వింత శబ్దాలు చేసి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు '96' సినిమా విడుదల తేదీ ఖరారు..!