Notifications: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో నాలుగు చోట్ల భూవినియోగ మార్పిడి ప్రతిపాదనలపై.. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శనివారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించింది. కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో జోనల్ డెవలప్‌మెంట్ ప్లానులో సర్వే నంబర్లు 122 (పీ), 123 (పీ), 124 (పీ)లో పారిశ్రామిక అవసరాలకు నిర్దేశించిన 24,422.77 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని స్థలాన్ని నివాస అవసరాలకు ఉపయోగించేలా భూ వినియోగ మార్పిడికి ప్రతిపాదించారు.
* గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అమరావతి రోడ్డులో గల కొరిటిపాడు డోర్ నంబరు 186 (పీ)లో పారిశ్రామిక అవసరాలకు నిర్దేశించిన 8,413.72 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించేలా భూ వినియోగ మార్పిడి కోసం ప్రతిపాదించారు.
* గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు డోర్ నంబరు 53/బి(పీ)లో వ్యవసాయ అవసరాలకు నిర్దేశించిన 5898.17 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని నివాస అవసరాలకు ఉపయోగించేలా భూ వినియోగ మార్పిడి కోసం ప్రతిపాదించారు.
* కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం వేమవరం సర్వే నంబర్లు 116/1సీ, 2, 3, 125/1, 127/1బీలో ప్రజా, పాక్షిక ప్రజా అవసరాలకు నిర్దేశించిన 53,013.82 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని నివాసం కోసం వినియోగించుకునేందుకు ప్రతిపాదించారు. వీటిపై ప్రజలు తమ అభ్యంతరాలను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ కార్యాలయంలో నిర్దేశించిన గడువులోగా తెలియజేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సూచించింది.
ఇదీ చదవండి: