ETV Bharat / city

రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు నూతన మార్గదర్శకాలు - పౌష్టికాహారంపై ప్రభుత్వం మార్గదర్శకాలు న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారులకు రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

New guidelines for preventing anemia and malnutrition

author img

By

Published : Dec 30, 2020, 4:55 AM IST

అంగన్​వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించేలా రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకుకూరలు కాయగూరలతో మంచి పౌష్టికాహారాన్ని వారికి అందించేందుకు రాష్ట్రంలో న్యూట్రి, కిచెన్ గార్డెన్ అభివృద్ధికి మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్​లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సాధికార సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 2,981 పంచాయతీల్లో న్యూట్రి గార్డెన్​లు, కిచెన్ గార్డెన్​లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 12,284 అంగన్​వాడీ సెంటర్లను ఈ పంచాయతీలకు అనుసంధానించనున్నారు. న్యూట్రి గార్డెన్స్ ద్వారా మహిళలకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. పైలట్ ప్రాతిపదికన 52 ఆరోగ్య న్యూట్రిషన్ క్లస్టర్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని న్యూట్రిషన్ స్మార్ట్ విలేజెస్​గా ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.