శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల పట్ల తెదేపా సభ్యులు వ్యవహరించిన తీరు సరిగా లేదని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. రూల్ 90 ప్రకారం నోటీసును 24 గంటల ముందుగానే ఇవ్వాలని చెప్పినా.. దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం వ్యవహరించిందన్నారు. మండలిలో తెదేపా సభ్యుడు మంత్రిపై దాడిచేయటం హేయమైన చర్య అని అన్నారు. పోడియం వద్దకు తమ సభ్యులు ఎవరూ వెళ్లలేదని.. వెళ్లిన వారిని కూడా వారించి వెనక్కు తీసుకువచ్చామని అన్నారు. డిప్యూటీ ఛైర్మన్ నిబంధనలు పాటించలేదన్నారు.
పేదలందరికీ ఇళ్లస్థలాలు
మరోవైపు గుంటూరు జిల్లాలో ఉచిత ఇళ్లస్థలాల కోసం 3 లక్షల లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. 4 వేల ఎకరాల భూసేకరణ జరిగినట్లు వివరించారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వటంతో పాటు ఉపాధి హామీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.