దేవాలయాల భూముల అన్యాక్రాంతాన్ని వైకాపా ప్రోత్సహిస్తోందని జనసేన ఆరోపించింది. విజయవాడ మధ్య నియోజకవర్గం పరిధిలోని కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆస్తిపై ఎప్పటినుంచో వివాదాలు నడుస్తున్నాయని... వంశపారంపర్య ధర్మకర్తలుగా చెప్పుకుంటున్న వారు భూములు తమవేనని చెప్పుకుంటున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ ఆరోపించారు. ఇప్పుడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందిన 600 గజాల విలువైన స్థలాన్ని, దాన్ని ఆనుకుని ఉన్న సీతారామ సత్రానికి చెందిన 300 గజాల స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు తీర్పు ఇచ్చిన స్థలాన్ని, దేవాదాయశాఖ స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ఓ పీఠానికి స్వాధీనం చేసేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎందుకు ఆరాటపడుతున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి