ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు వామపక్షాల ఫిర్యాదు - cpi ramakrishna met governer news
వామపక్ష నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. అమరావతినే రాజధానిగా కొనసాంచేందుకు.. అధికారాన్ని వినియోగించాలని కోరారు. రాజధాని పరిధిలోని కట్టడాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఫిర్యాదు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం ఆచితూచి స్పందించేలా చూడాలని చెప్పారు. లేదంటే.. ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని.. జగన్‌కు తెలియజేయాలన్నారు. అలాగే.. స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల వివాదంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.