లాక్ డౌన్ సమయంలో పట్టుబడి విజయవాడ కార్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణం వద్ద ఉన్న వాహనాలను సీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి వాహనదారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ చూపిన తర్వాతే వాహనాలను ఇస్తున్నామన్నారు .లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లఘించిన 8500 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఇప్పటికే 5వేల వాహనాలు తిరిగి ఇచ్చేశామని సీపీ తెలిపారు. వాహనదారుల నుంచి పూచికత్తు పత్రాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరి నుంచి డబ్బులు తీసుకోవట్లేదన్నారు. ఎంవీఐ యాక్ట్ ప్రకారం సీజ్ చేసిన వాహనాలకు ఆన్లైన్ చలానా విధిస్తామన్నారు. ఐపీసీ ప్రకారం స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టు తీర్పు అనుసరించి వ్యవహరిస్తామన్నారు.
ఇది చదవండి విధాన లోపం: భూవినియోగం.. అయోమయం!