ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరులో సర్పంచ్ అభ్యర్థి భర్త అర్జున్ నాయక్ మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి అదే రోజు చెట్టుకు ఉరివేసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైకాపా నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: సోమిరెడ్డి
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. "నెల్లూరు నుంచి దేశంలో రెండో అత్యున్నతస్థాయికి ఎదిగిన తెలుగుబిడ్డను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. విజయసాయి వెంటనే తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వెంకయ్యనాయుడుతో పాటు తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి' అని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
ఏ2కు అభ్యంతరమేంటి: అయ్యన్నపాత్రుడు
రాష్ట్ర హైకోర్టు.. మీ ఏ1ని 6093 అని తీర్పు కాపీలో చెప్పింది. అదే విషయాన్ని ఎంపీ కనకమేడల చదివారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అన్నారు. 'ఇందులో ఏ2కు అభ్యంతరం ఏముంది? దీని కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై వ్యాఖ్యలు చేసి అందరితో మళ్లీ నువ్వు ఎదురు తిట్టించుకోవటం ఎందుకు. నువ్వు ఎంత గింజుకున్నా మీ వాడి నంబర్ 6093. ఇంతకీ నీ నంబర్ ఎంత ఏ2?' అని ట్విట్టర్ వేదికగా విజయసాయిపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
ఇదీ చూడండి: