ETV Bharat / city

18 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర పురస్కారాలు

author img

By

Published : Jan 26, 2021, 11:26 AM IST

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని 18 మందికి పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పురస్కారాలు దక్కాయి. ఇద్దరికి శౌర్యపతకం, ఒకరికి రాష్ట్రపతి పోలీసు సేవా పతకం,15 మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి.

18 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర పురస్కారాలు
18 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర పురస్కారాలు

పోలీసు శాఖకు చెందిన 18 మంది అధికారులు, సిబ్బందికి కేంద్ర పురస్కారాలు లభించాయి. అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ గొంగటి గిరీష్ కుమార్, జూనియర్ కమాండో కుడిపూడి హరికృష్ణ శౌర్యపతకానికి ఎంపికయ్యారు. విజయవాడ ఏసీబీ ఏఆర్ ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీసు సేవా పతకం లభించింది.

ప్రత్యేక ఎన్​ఫోర్స్ మెంట్ విభాగం డైరక్టర్​గా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి పీహెచ్ డీ రామకృష్ణకు పోలీసు సేవా పతకం వరిచింది. జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఛీఫ్ హెడ్ వార్డర్ ఎం. అరుణ్ కుమార్, హెడ్ వార్డర్ అరిగెల రత్నరాజుకు సేవా పతకాలు దక్కాయి. కేంద్ర బలగాల్లో పని చేస్తున్న ముగ్గురికి పోలీసు సేవా పతకాలు వచ్చాయి.

ఇదీ చదవండి:

విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.