అంతర్జాతీయ గ్లోబల్ స్కూల్ ప్రిన్యూర్ సమ్మిట్‌తో సరికొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ పవన్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలకు 203 మంది విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు. వీరిలో నుంచి 30 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తామన్నారు. వీరందరికి డిసెంబర్ 14వ తేదీన రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. వినూత్నంగా ఆలోచించే విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతిభావంతులైన యువకులను వెలికితీసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమ్మిట్‌ను దేశంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి : విశాఖ మన్యం.. ప్రకృతి సోయగం