- ఈ ఏడాది నుంచే
మన బడి నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాదే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వైరస్ గుబులు
రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 38 లక్షలు దాటాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జాతీయస్థాయి గుర్తింపు
2020 సంవత్సరానికి ఉత్తమ రచనగా సమ్త్ ఓ రఫ్తార్’ ఉర్దూ పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగాచార్యులు ఎండీ నిస్సార్ అహ్మద్, అమీనుల్లా సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మళ్లీ సోదాలు
దుర్గగుడిలో అనిశా అధికారులు మరోసారి సోదాలు చేశారు. పరిపాలనా భవనం, జమ్మిదొడ్డిలో తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ' వ్యూహం' ఫలిస్తుందా?
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశం కేరళ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది. భక్తుల హక్కులను పరిరక్షిస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించడం, ఇందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇవ్వడం వల్ల రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఖైదీ హత్యపై దిగ్భ్రాంతి
జైలు ఆవరణలో ఓ ఖైదీని కత్తులతో పొడిచి హత్య చేయటం షాక్‌కు గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేసింది దిల్లీ హైకోర్టు. ఇలాంటి ఘటనలు కల్పిత కథల్లోనే చూస్తామని పేర్కొంది. తిహార్ జైలులో జరిగిన ఘటనపై బాధితుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది న్యాయస్థానం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఓలి రాజీనామా?
నేపాల్‌లో రద్దైన ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రధాని కేపీ శర్మ ఓలికి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం తీర్పుతో ఓలి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తేలిందని, రాజీనామా చేయాలని డిమాండ్లు పెరిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వేధింపుల కట్టడికి
చిన్నారులపై వేధింపులకు సంబంధించిన అంశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ దృష్టి సారించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా.. చిన్నారులకు హాని కలిగించే సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మాస్టర్ బ్లాస్టర్ ఫిదా
మూడో టెస్టులో అక్షర్ బౌలింగ్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించాడు లిటిల్ మాస్టర్ సచిన్ తెందుల్కర్. అద్భుతంగా బౌలింగ్ చేశావంటూ అక్షర్‌ను కొనియాడాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అక్కడ ఆదరణ దక్కలేదు'
'క్రాక్', 'నాంది' చిత్రాల్లో నటించి వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్. తాజాగా 'నాంది' విజయంపై స్పందించిన ఆమె ఆ సినిమా చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.