TTD NEWS: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర సహాయ మంత్రి క్రిష్ణ పాల్ గుర్జార్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజస్థాన్ రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ఇందువదన చిత్ర బృందం..

తిరుమల శ్రీవారిని ఇందువదన చిత్ర బృందం దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో చిత్ర దర్శకుడు ఎంఏసీఆర్, నటులు వరుణ్ సందేశ్, మహేష్ విట్టా కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: