ETV Bharat / city

మోకాళ్లపై కూర్చుని.. తిరుమల తిరుపతి పరిరక్షణ సభ్యుల నిరసన - tirumala latest news

శ్రీవారి మెట్ల మార్గాన్ని తెరవాలంటూ తిరుమల తిరుపతి పరిరక్షణ సభ్యులు డిమాండ్ చేశారు. మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.

tirumala tirupati protection people protest
శ్రీవారి మెట్ల వద్ద తిరుమల తిరుపతి పరిరక్షణ సభ్యుల నిరసన
author img

By

Published : Oct 10, 2020, 4:11 PM IST

అలిపిరి నడక మార్గంలో షెల్టర్​ రిపేర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నడకదారి వెళ్లే భక్తులకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంపై తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి సభ్యులు... శ్రీవారి మెట్టు మార్గం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అలిపిరి మార్గంలో మరమ్మతుల కారణంగా శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రత్యామ్నాయం చూపడంలో తితిదే విఫలమైందని సమితి అధ్యక్షుడు ధనంజయ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా మూతపడ్డ శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించాలని కోరారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు ధర్మరథం బస్సుల్లో భక్తులను తరలించాలని డిమాండ్​ చేశారు. దర్శనం టికెట్లు పెంచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కలిగించాలన్నారు.

ఇదీ చదవండి:

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.