రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో అప్పుడే పుట్టిన శిశువు చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వేసేవారు. శిశువులు మారకుండా, అపహరణకు గురికాకుండా ఇవి ఎంతగానో ఉపయోగపడేవి. శిశువును బయటకు తీసుకెళ్లాల్సివచ్చినప్పుడు, డిశ్చార్జి అయినప్పుడు సంబంధిత విభాగంలో నమోదు చేసుకొని వెళ్లేవారు.
కరోనా నేపథ్యంలో ఏడాదిగా ఆర్ఎఫ్ఐడీలు వేసే విభాగం మూతపడింది. ఆసుపత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ జి. సోమసుందరరావును వివరణ కోరగా ఆర్ఎఫ్ఐడీలు వేసే విభాగాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి శిశువులను గుర్తించేందుకు వీలుగా చేతికి మామూలు ట్యాగులు వేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: