ETV Bharat / city

నెల్లూరు జిల్లాకు కొత్త కాపురానికి వచ్చిన దేవతాపక్షులు - నెల్లూరు జిల్లా పులికాట్ నేలపట్టు బర్డ్ సంక్చూరీ

ఏటా వచ్చే విదేశీ అతిథులు నెల్లూరు జిల్లాకు మళ్లీ పర్యాటక శోభను తీసుకొచ్చాయి. విశాల సముద్రతీరం పచ్చని పొలాలు... ప్రకృతి అందాల మధ్య వెలసిన ఆలయాలతోపాటు పులికాట్‌ సరస్సు శోభ నెల్లూరు జిల్లాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. కొత్త కాపురానికి వచ్చిన దేవతాపక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

pullicat nelapattu bird sanctuary
pullicat nelapattu bird sanctuary
author img

By

Published : Nov 26, 2020, 7:00 PM IST

పులికాట్‌ సరస్సు-నేలపట్టు పక్షుల కేంద్రానికి ఏటా విదేశీ విహంగాలు వస్తుంటాయి. పెలికాన్స్‌, గూడబాతులు, కొంగలు వంటి 25 రకాల విదేశీ పక్షులు ఇక్కడ సందడి చేస్తాయి. ఇవన్నీ గాల్లో విహరిస్తుంటే పర్యాటకులు వీటిని చూస్తూ ఆనందం పొందుతారు. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో వాటి అందాలను బంధిస్తారు. శాస్త్రవేత్తల పరిశోధనలకూ ఇవి ఉపయోగపడతాయి.

ఏడు దేశాల నుంచి...

ఏడు దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి విదేశీ విహంగాలు పులికాట్‌ సరస్సుకు వస్తుంటాయి. ఐదు నెలలు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేస్తాయి. తరువాత వాటి పిల్లలతో సహా తమ స్వదేశాలకు ప్రయాణమవుతాయి. ఈ ఐదు నెలలూ పులికాట్‌ సరస్సులో అవి చేసే సందడి అంతా ఇంతా కాదు. రైతులు, మత్స్యకారులు, అధికారులు వీటిని సంరక్షిస్తారు. దేవతా పక్షులుగా పిలుస్తూ.. ఎవరూ వాటికి హాని చేయకుండా చూస్తారు.

నెల్లూరు జిల్లాకు కొత్త కాపురానికి వచ్చిన దేవతాపక్షులు

కుటుంబ సమేతంగా...

పులికాట్‌ సరస్సు మధ్యలోనే అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట ఉంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి సమీపంలోనే పులికాట్‌ ఉండటంతో ఈ మార్గంలో ప్రయాణించేవాళ్లంతా ఓసారి పక్షుల సందడి చూసి వెళ్తుంటారు. అటకానితిప్ప, భీమునిపాలెం, నేలపట్టు, సూళ్లూరుపేటలోని ఆహ్లాదకర వాతావరణంలో విదేశీ విహంగాలను సందర్శిస్తారు. బోటు షికారుతోపాటు రిసార్టులూ ఉండటంతో కుటుంబసమేతంగా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు.

పక్షుల సందడి వీక్షించాల్సిందే..!

పల్లెపాడు, మైపాడు, కావలిలో సముద్రతీర స్నానాలకు వెళ్లేవాళ్లు, రెండో శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయం, పెంచలకోన పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చేవాళ్లు విదేశీ విహంగాల సందడిని వీక్షిస్తుంటారు. కొండలమధ్య సహజసిద్ధంగా ఏర్పడిన పెద్ద జలపాతాలు చూసేందుకు వచ్చే సందర్శకులు పులికాట్‌ అందాలతోపాటు విదేశీ పక్షుల సందడిని వీక్షించేందుకు మొగ్గుచూపుతారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో ఎడతెగని వర్షం... ఈదురుగాలుల బీభత్సం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.