ETV Bharat / city

గ్యాస్ ధరలు మళ్లీ పెంపు.. ఇల్లు ఎలా గడుస్తుందని మహిళల ఆందోళన - గ్యాస్​ ధరలను మరోసారి పెంచిన కేంద్రం

Womens fire on Gas Rates hike: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచడంపై కర్నూలులో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్నామని.. ఈ క్రమంలో మరోసారి గ్యాస్​ ధరలు పెంపుతో ఇల్లు ఎలా గడుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

protest against gas rates hike in Kurnool

author img

By

Published : Jul 6, 2022, 3:42 PM IST

Protest against gas rates hike in Kurnool: గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్​ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్‌ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

గ్యాస్‌ సిలిండర్ ధరలు పెంచడంపై కర్నూలులో మహిళలు మండిపడ్డారు. గృహ వినియోగదారుల సిలిండర్​పై రూ. 50 పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని.. గ్యాస్ ధరలు మరింతగా పెరగటంతో ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యాస్ మంటలు.. కర్నూలులో మహిళలు ఆగ్రహం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.