ETV Bharat / city

NagarjunaSagar: సాయంత్రం తెరుచుకోనున్న నాగార్జునసాగర్ గేట్లు... - తెలంగాణ వార్తలు

కృష్ణా బేసిన్​లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జూరాల, శ్రీశైలం పూర్తిగా నిండి గేట్లు ఎత్తగా నాగార్జునసాగర్(NagarjunaSagar) క్రస్ట్​ గేట్లు సాయంత్రం తెరుస్తామని సీఈ శ్రీకాంత్‌రావు తెలిపారు. ఈ జలాశయానికి ఉదయం 6 గంటలకు... 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.

heavy-inflow
heavy-inflow
author img

By

Published : Aug 1, 2021, 9:54 AM IST

నాగార్జునసాగర్(NagarjunaSagar) జలాశయానికి వరద మరింత పెరిగింది. ఉదయం 6 గంటలకు... 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. ఉదయం 5 గంటల వరకు 3 లక్షల 56 వేల 859 క్యూసెక్కులున్న ప్రవాహం... మరో గంటకే భారీస్థాయిలో పెరిగింది. 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను 579.20 అడుగుల మేర నీకు ఉంది. 312.04 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 36 వేల 543 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీకి 12 వందల క్యూసెక్కులు మొత్తంగా... 37 వేల 743 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు. ఎన్నెస్పీ అధికారులు జలాశయం క్రస్ట్ గేట్లను పరిశీలించారు. సాయంత్రం 6 గంటలకు సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తామని సీఈ శ్రీకాంత్‌రావు తెలిపారు.

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీట ప్రవాహం

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 207.41 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

జూరాల 47 గేట్లు ఎత్తివేత

జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 4.75 లక్షల క్యూసెక్కులుగా ఉండగా ఔట్‌ఫ్లో 4,77,745 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 5.973 టీఎంసీలుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు దాదాపుగా నిండింది. నాగార్జునసాగర్​ గేట్లు తెరిస్తే ఈ జలాశయంలోకి ఇన్​ఫ్లో పెరుగుతుంది.

ఇదీ చదవండి:పురుషుల్లో వంధ్యత్వం- విషతుల్య రసాయనాలే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.