కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా.. అత్యవసర పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. మైదుకూరులో లాక్డౌన్ అమలు పై డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ మధుసూదన్గౌడ్లతో ఆయన సమీక్షించారు. ప్రజలు రహదారులపైకి చేరకుండా ఇంటికే పరిమితమయ్యేలా చైతన్యపరచాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విశాలమైన ప్రాంతంలో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయాలని డీఎస్పీకి సూచించారు.
ఇదీ చదవండి: 'కరోనా చికిత్సకు 69 ఔషధాలు గుర్తింపు!'