వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జూమ్ సమావేశంలో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ.. కడప జిల్లా ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు, వైద్య సిబ్బంది నల్లపట్టీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రానున్న 2 రోజులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు.
వైద్యాధికారి టి. సిల్వియా సాల్మన్, ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జోనల్ ఉపాధ్యక్షుడు మాచనూరు రాఘవయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వైద్యాధికారులను, ఆరోగ్య సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. కరోనా కేసులు తగ్గించడంలో వైద్య సిబ్బంది బాగా పని చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ ఉంటే.. కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: