కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్న సహాయచర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికసాయం చేసేందుకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులంతా 7 కోట్ల 87 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు విరాళానికి చెందిన చెక్కును... సీఎం జగన్‌కు... విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. కోవిడ్–19 సహాయ చర్యల కోసం గుంటూరు జిల్లా పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే నంబూరి శంకరరావు... 25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు. సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు 44 లక్షల 52వేలు విరాళమిచ్చారు.
ఇవీ చదవండి: కరోనా గురించి చైనా ఇన్ని అబద్ధాలు చెప్పిందా?