వైకాపా పాలనలో అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సముచితస్థానం కల్పిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అన్ని రకాల పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమం, ఎదుగుదలకు సీఎం కృషి చేస్తూ మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బి.హేమమాలినిరెడ్డికి ధర్మాన పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా సంక్షేమ పాలనను అందిస్తున్నారన్నారు. మద్యం విషయంలో ఎన్నికల ముందుచెప్పినట్లుగానే పేదలు మద్యం జోలికెళ్తే షాక్ కొట్టేలా చేస్తామని చెప్పి.. మద్యాన్ని టైట్ చేశారన్నారు. ప్రతిపక్ష తెదేపా సద్విమర్శలు చేస్తే తాము ఆహ్వానిస్తామని అలాకాకుండా.. రాజకీయ లబ్ధిపొందుతామంటే అది వృథానేనన్నారు.
మహిళా ఆర్థిక సంస్థ ఛైర్మన్ హేమమాలిని రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ తనకు పదవిని కేటాయించటం పట్ల సంతోషంగా ఉందని.. మహిళల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయటంలో తనవంతు కృషి చేస్తానన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన హేమమాలిని రెడ్డికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు, ఎమ్మెల్యేలు మద్ధాలి గిరిధర్‌రావు, ముస్తఫా, మహిళా శిశు సంక్షేమ సంచాలకులు క్రిత్తికాశుక్లా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: