ETV Bharat / city

'ఉద్యోగులపై సీఎంకు ఎందుకంత కక్ష?'

ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం ఎంతవరకూ సమంజసం కాదని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు. ఉద్యోగులపై సీఎం జగన్​ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

tdp leaders fires on ysrcp
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతల ఆగ్రహం
author img

By

Published : Apr 5, 2020, 5:46 AM IST

ఉద్యోగులపై సీఎం జగన్‌కు కక్ష ఎందుకని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు నిలదీశారు. కమీషన్ల కోసం ఓ గుత్తేదారుకి సీఎం జగన్‌ రూ.6,400 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఆ మొత్తం ఉద్యోగుల జీతాలకు సరిపోయేదన్నారు. గతేడాది కంటే 30 వేల కోట్ల అధికాదాయం వచ్చిందని, జీఎస్టీ వసూళ్ల తగ్గుదల 2 శాతం మాత్రమేనని గుర్తుచేస్తూ ట్వీట్‌ చేశారు.

ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం ఎంతవరకూ సమంజసమని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు నిలదీశారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నవారికి కనీసం మాస్కులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం... కోతలు విధించటం క్షోభకు గురిచేయటమేమిటన్నారు. అధికారు బెదిరింపులతో విధులకు హాజరవ్వలేని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 192 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.