కర్నూలు జిల్లా సున్నిపెంటలో కంప్యూటర్ రిపేర్ దుకాణంలో ఓ పాము కలకలం రేపింది. మరమ్మతు కోసం ఇచ్చిన సీపీయూలోకి చిన్నపాటి పాము చొరబడింది. సీపీయూను రిపేర్ చేసేందుకు మెకానిక్ ప్రయత్నించగా... పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది.
వెంటనే పాములు పట్టే కాళీ చరణ్ అనే వ్యక్తిని పిలిపించారు. ఆయన వచ్చి సీపీయూలోని పామును బయటకు తీశారు. తెలుపు, నలుపు మచ్చలు కలిగిన సర్పాన్ని క్షేమంగా.. సమీప అడవుల్లో విడిచిపెట్టారు.
ఇదీ చదవండి: