ETV Bharat / city

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయండి: పవన్​ కల్యాణ్

author img

By

Published : Dec 10, 2020, 4:06 PM IST

Updated : Dec 11, 2020, 8:02 AM IST

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్ కోరారు. పరీక్ష తేదీలను ప్రకటించేటప్పుడు ఇతర నోటిఫికేషన్ తేదీలను పరిగణించకపోవడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు.

pawan kalyan on group 1 exams
pawan kalyan on group 1 exams

ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్‌ ఏమైపోయిందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రణాళిక లేని తీరువల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై పునరాలోచన చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వస్తే చెప్పిన తేదీల్లో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తారనే నమ్మకం యువత కోల్పోతోందని ఆరోపించారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ఇస్తామని చెప్పి.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదన్నారు. ఇతర ఉద్యోగాలకు సైతం నిరుద్యోగులు సన్నద్ధం అవుతూ ఉంటారని.. ఒక పరీక్ష కోసం మరొకటి వదులుకునే పరిస్థితి రాకూడదని పవన్ పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ తేదీలను వాయిదా వేస్తే యువతలో ఆందోళన తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: షెడ్యూల్‌‌ ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు: హైకోర్టు

Last Updated : Dec 11, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.