ETV Bharat / city

ఏకగీవ్రాలను రద్దు చేసి..మళ్లీ ఎన్నికలు జరపండి: నిమ్మల - ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి.. మళ్లీ జరపాలని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐదు జిల్లాల్లో భారీ స్థాయిలో ఏకగీవ్రాలు చేసుకున్నారని ఆరోపించారు.

nimmala-ramanaidu-comments-on-local-elections

author img

By

Published : Mar 17, 2020, 7:28 PM IST

మీడియాతో మాట్లాడుతున్న నిమ్మల రామానాయుడు

ఫ్యాక్షన్ రాజకీయాలతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 2014లో ఒక్క జడ్పీటీసీ మాత్రమే ఏకగ్రీవమైందని.... ఇప్పుడు 126 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. అందుకే స్థానిక ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో వైకాపా నేతలు అరాచాకాలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై జరిగిన హత్యాయత్నంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వచ్చేది అన్ని సీట్లే ..

కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. పారసిటమాల్‌ మందులు, బ్లీచింగ్ పౌడర్ల వాడకం తెలియక విదేశాలు కరోనా పట్ల ఇంత అప్రమత్తంగా ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తే... వచ్చే ఎన్నికల్లో జగన్​కి వచ్చే సీట్లు కూడా అవేనని, ఈ సూత్రం చెప్పింది కూడా జగనేనని గుర్తు చేశారు.

వివరాలు ఉన్నాయా..?

విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని నిమ్మల ప్రశ్నించారు. రెండు వారాల్లో రాష్ట్రానికి 10వేల మంది విదేశాల నుంచి వచ్చారని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రాణాలను ఎన్నికల కమిషనర్ కాపాడారని చెప్పారు.

ఇదీ చదవండి : జార్ఖండ్ కొత్త డీజీపీగా ఏపీకి చెందిన వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.