ETV Bharat / city

'రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం... దళిత వ్యతిరేక పాలన'

వైకాపా ప్రభుత్వం దళితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ఏయూ ఆచార్యుడు ప్రేమానందంపై కులవివక్ష, డా.సుధాకర్​ అరెస్టు, కచ్చులూరు ప్రమాదంపై ప్రశ్నించినందుకు హర్షకుమార్ అరెస్టు ఇలా దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
author img

By

Published : Jun 2, 2020, 9:07 PM IST

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

విశాఖ ఆంధ్ర విశ్వకళాపరిషత్​లో కులవివక్ష దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏయూలో జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కుల‌కు దిక్కుగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని.. సీఎం జగన్ అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతల దౌర్జన్యాలు, అణచివేత‌ల‌తో ద‌ళితులు ద‌గా ప‌డ్డారని విమర్శించారు.

కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్​పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై ప్ర‌శ్నించినందుకే మహాసేన రాజేశ్​పై రౌడీషీట్ తెరిచారని దుయ్యబట్టారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

మాస్కుల్లేవ‌ని అడిగిన ద‌ళిత డాక్టర్ సుధాక‌ర్‌ని ఘోరంగా బంధించారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ద‌ళితుల‌కు ఉపాధి క‌ల్పించే లిడ్‌క్యాప్ భూములు లాగేసుకున్నారన్న ఆయన.. వైకాపా ప్రజావ్యతిరేక పాల‌న‌పై తిరుగుబాటు త‌ప్పదని హెచ్చరించారు. ప్రిజనరీ దెబ్బకు జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయిందని మండిపడ్డారు.

మూడు రాజధానుల నిర్ణయాలతో పెట్టుబడిదారులు పారిపోయేలా చేశారని లోకేశ్ విమర్శించారు. పీపీఏ ఒప్పందాలు రద్దు చేసి అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడేలా చేశారన్నారు. లూలూ, అదానీ లాంటి సంస్థలను బెదిరించి వెనక్కి పంపి యువత భవితపై దెబ్బకొట్టారని లోకేశ్ మండిపడ్డారు.

ఇదీ చదవండి:

'నవ్వుల పాలైన తెలుగువారు'... వీడియో విడుదల చేసిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.