తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో నామ పత్రాల ఉపసంహరణ ప్రక్రియ మెుదలైంది. మెుదటి రోజు 40 మంది అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో మొదటి రోజు మొత్తం 65 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు .
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక ఎన్నికలకు మెుదటి రోజు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో భాగంగానే పట్టణంలోని 16, 25 వార్డుల్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆమె 26 వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగానే కొనసాగనున్నారు.
నర్సీపట్నం మున్సిపాలిటీలో మెుత్తం 39 మంది వివిధ పార్టీలకు చెందిన, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నుంచి ఉపసంహరించుకున్న అభ్యర్థులు తమపై ఎవరి ఒత్తిడీ లేదని అధికారులకు తెలిపారు.
హిందూపురం మున్సిపాలిటీలో మొదటి రోజు నామ పత్రాల ఉపసంహరణలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు 12 మంది, వైకాపా సానుభూతిపరులు 8 మంది, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు తమ నామ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
ధర్మవరం పురపాలకలో నామినేషన్ల ఉపసంహరణ మొదటిరోజు.. మెుత్తం 28 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తెదేపా- 8, కాంగ్రెస్- 1, భాజపా- 1, జనసేన- 3, వైకాపా- 11 నామినేషన్లు ఉపసంహరణ జరిగాయి.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఉపసంహరణ లో భాగంగా నేడు 9 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పురపాలక 29 వార్డులో నామినేషన్ను దాఖలు చేసిన వారిలో 34 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
పార్వతీపురం పురపాలికలో 30 మంది అభ్యర్థులు తమ నామ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పక్రియ కొనసాగుతోంది. నంద్యాలలో తొలిరోజు కొంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ తర్వాత 14 వార్డులో ఆళ్లగడ్డ విమలమ్మ, 22 వార్డులో నేలటూరు చంద్రశేఖర్ రెడ్డి, 32 వార్డులో మలికిరెడ్డి లలిత, 36 వార్డులో శిల్పా నాగినిరెడ్డి.. ఒక్కో వార్డుకు ఒకరే బరిలో ఉన్నారు. వీరంతా అధికార పార్టీకి చెందినవారు. మూడో తేదీ సాయంత్రం వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తామని నంద్యాల ఎన్నికల సహాయ అధికారి వెంకట కృష్ణ తెలిపారు.
కడప జిల్లాలో..
కడపజిల్లా ఎర్రగుంట్ల, రాయచోటి మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో ఇవాళ నాలుగు వార్డులకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 5, 11, 15 వార్డులకు గతంలో నామినేషన్ విత్ డ్రా చేసుకున్న వైకాపా, జనసేన, భాజపా అభ్యర్హులు తిరిగి నామినేషన్ దాఖలు చేశారు. రాయచోటి మున్సిపాలిటీలో 20, 31 వార్డులకు అనుమతి లభించగా.. 20వ వార్డుకు తెదేపా అభ్యర్థి చలపతి, 31వ వార్డుకు ఎవరూ నామినేషన్ వేయలేదు.
ఇదీ చదవండి: