ETV Bharat / city

వాల్వ్‌ మాస్కులతో ప్రమాదం: ప్రముఖ వైద్య నిపుణులు కొడాలి జగన్మోహన్​రావు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో.... ఎలాంటి మాస్క్‌లు ధరిస్తే మంచిది?.. గుడ్డతో చేసిన మాస్క్‌లతో ప్రయోజనం ఉంటుందా..? వాల్వ్‌లు ఉన్న మాస్కులు ధరించడం ప్రమాదకరమా? వంటి అనేక అనేక సందేహాలపై ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కొడాలి జగన్మోహన్​రావు పలు విషయాలను వెల్లడించారు.

medical
medical
author img

By

Published : Jul 22, 2020, 8:14 AM IST

కరోనా ఇంతలా విజృంభిస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో చాలామంది మాస్క్‌ల పట్ల శ్రద్ధ చూపడంలేదు. ఇదే విషయమై ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చినా పాటించడంలేదు. కొందరు పేరుకి మాస్క్‌ ధరించినా... తలపైకో, గొంతు కిందకో లాగేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లోనూ మాస్క్‌ లేకుండా ఎదురెదురుగా నిల్చుని ముచ్చటిస్తున్నారు. ‘‘కరోనా సోకి, లక్షణాలు కనిపించని వ్యక్తి, ఆరోగ్యవంతునికి సన్నిహితంగా వచ్చినా... ఇద్దరూ మాస్క్‌ ధరించి ఉంటే కరోనా సంక్రమించే అవకాశం 1.5% మాత్రమే. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. మాస్క్‌ పెట్టుకోని వారితో మాట్లాడకండి. మీ సమీపంలోనే రానివ్వకండి’’ అని స్పష్టం చేస్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డా।। కొడాలి జగన్మోహన్‌రావు. ఆయనతో ‘ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖి..

చాలామంది వాల్వులు ఉన్న మాస్కులు మరింత రక్షణ ఇస్తాయని నమ్ముతున్నారు. అది నిజమేనా?
‘‘మార్కెట్‌లో ఎన్‌-95, మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌, ఎఫ్‌ఎఫ్‌పీ1 మాస్కులు లభిస్తున్నాయి. ఇవన్నీ సురక్షితమైనవే. వైరస్‌ల నుంచి 95% వరకు రక్షణ కల్పిస్తాయి. బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడులను 100%-80% వరకు నిలువరిస్తాయి. గుడ్డతో చేసిన మాస్క్‌లూ మేలే చేస్తాయి. కానీ వీటిలో వాల్వ్‌ ఉండే మాస్క్‌లతో కొన్ని ఇబ్బందులున్నాయి. వాల్వు మాస్కులను ధరించిన వ్యక్తికి పూర్తి రక్షణ లభిస్తుంది. మాస్క్‌ లోపల తేమ చేరదు. కానీ... వాళ్ల చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రం అవి ప్రమాదకరం. ఆ మాస్క్‌ ధరించిన వ్యక్తి లోపలికి పీల్చుకునే గాలిని అది బాగానే వడపోస్తుంది. కానీ బయటకు విడిచే గాలిని మాత్రం వడపోయదు. పైగా వారి శ్వాస నుంచి వెలువడే వైరస్‌లన్నీ ఒక్కసారిగా వాల్వ్‌ నుంచి వేగంగా బయటకు వస్తాయి. అది ఇతరుల్ని ప్రమాదంలోకి నెడుతుంది. అందువల్ల వాల్వులున్న మాస్కులు వాడొద్దు.

వస్త్రంతో చేసిన మాస్కులు మంచివేనా?
వస్త్రంతో చేసిన మాస్క్‌ను ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో సొంతంగా తయారు చేసుకోవచ్చు. సరిగా వాడితే ఎదుటి వ్యక్తుల నుంచి వెలువడే తుంపర్లను అవి పూర్తిగా అడ్డుకుంటాయి. ఒకవేళ ఆ తుంపర్లలో వైరస్‌ ఉన్నా దాన్నుంచి రక్షణ ఇస్తాయి. గుడ్డ మాస్క్‌లను ప్రతి 6 గంటలకు ఒకసారి మార్చాలి. దీంతో పాటు ఫేÆస్‌ షీల్డ్‌ కూడా ధరిస్తే మరీ మంచిది.

ఫేస్‌ షీల్డ్‌తో రెట్టింపు రక్షణ నిజమేనా?
ఇప్పటివరకు ఉన్న అధ్యయనాల ప్రకారం... వ్యక్తులు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా నోటి ద్వారా వెలువడే తుంపర్ల నుంచే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని తేలింది. అందుకే... మాస్క్‌పాటు ముఖ కవచం(ఫేస్‌ షీల్డ్‌) కూడా ధరిస్తే రెట్టింపు భద్రత లభిస్తుంది. వీటిని శుభ్రం చేయడం తేలిక. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.

మాస్క్‌ ఎలా ధరిస్తేనే మేలు?
* ఎలాంటి రకం మాస్క్‌ వాడుతున్నామనే దానికంటే... ఎలా ధరించామన్నది మరీ ముఖ్యం. ముక్కు పైనుంచి, గడ్డం కింది వరకు కప్పి ఉంచుతూ... అటూఇటూ ఖాళీలు లేకుండా బిగుతుగా పట్టి ఉండేలా ధరించాలి.
* కొందరు మాస్క్‌ని గడ్డం కిందకు, గొంతుమీదికి లాక్కుంటున్నారు. అది ఏమాత్రం సురక్షితం కాదు. గొంతుపై అప్పటికే వైరస్‌ ఉంటే, అది మాస్క్‌ లోపలి భాగానికి అంటుకుంటుంది. మాస్క్‌ని మళ్లీ ముక్కు మీదికి లాక్కున్నప్పుడు... శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
* మరికొందరు మాస్క్‌ పెట్టుకున్నాక, దాని ముందు భాగాన్ని పదేపదే తాకడం, పైకీ కిందకీ లాగడం చేస్తున్నారు. అది మరీ ప్రమాదకరం. దానికి ఉన్న వైరస్‌ మీ చేతికి అంటుకుంటుంది. అదే చేత్తో మీరు ముక్కునో, కళ్లనో, నోటినో తాకితే వైరస్‌ మీలోనికి ప్రవేశిస్తుంది. ఒకవేళ వివిధ ప్రదేశాల్ని తాకితే మరికొందరికి వైరస్‌ సోకడానికి కారకులవుతారు.

ఆఫీసుల్లోనూ వాడాలా?
చాలామంది కార్యాలయాల్లోకి వెళ్లాక సహోద్యోగులంతా మనకు తెలిసినవాళ్లే కదా? అన్న ఉద్దేశంతో మాస్క్‌లు తీసేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. మనం సహోద్యోగులతోనే ఎక్కువ సమయం గడుపుతాం. వారిలో ఎవరికి వైరస్‌ ఉందో చెప్పలేం. ప్రస్తుతం మనకు ఎదురుపడే ప్రతి ఒక్కర్నీ కొవిడ్‌ రోగిగానే భావించి జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులు, బంధువులే కదా అన్న ధైర్యంతో... మాస్క్‌లు ధరించకుండా సన్నిహితంగా మెలగడం, మాట్లాడటమూ ప్రమాదకరమే.

ఇంట్లో ఉన్నప్పుడూ పెట్టుకోవాలా?
ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌ పెట్టుకోకపోవడమే మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంట్లోనూ మాస్క్‌ వాడితే తగినంత ఆక్సిజన్‌ లభించిక సమస్యలు ఏర్పడవచ్చు. అయితే... ఇంట్లో 65 ఏళ్లు పైబడిన వృద్ధులుంటే కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. కలసి భుజించడం వంటివి వద్దు. పిల్లలనూ దగ్గరకు తీసుకోవడం మంచిది కాదు. వాళ్లదగ్గరకు వెళ్తుంటే మాస్క్‌ పెట్టుకోవాలి.

ఎక్కువ సేపు ధరిస్తే సమస్యలేమైనా ఉంటాయా?
ఎన్‌-95 వంటి మాస్క్‌లను ఎక్కువ సమయం ధరిస్తే కార్బన్‌ డైఆక్సైడ్‌ పెరిగి, తగినంత ఆక్సిజన్‌ అందక కొందరిలో తలనొప్పి, ఆయాసం వంటి చిన్నచిన్న సమస్యలు తలెత్తవచ్చు. అలాంటప్పుడు దగ్గరల్లో ఎవరూ లేకుండా చూసుకుని, కాసేపు మాస్క్‌ తొలగించి గాలి పీల్చుకుంటే సరిపోతుంది. క్లాత్‌ మాస్క్‌లు లాంటివి ఎంత సమయమైనా ధరించవచ్చు.

కడిగి లేదా ఉతికి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చా?
గుడ్డ మాస్కులైతే 6 గంటలకొకటి మారుస్తూ ఉతికిన వాటిని వాడుకోవచ్చుగానీ సర్జికల్‌, ఎన్‌-95 వంటి మాస్కులను ఉతికి లేదా కడిగి వాడకూడదు. ఎన్‌-95 మాస్క్‌ల ధరించేవారు... కనీసం అయిదింటిని సిద్ధంగా పెట్టుకోవాలి. వాటిపై ఒకటి నుంచి అయిదు అంకెలు వేసుకోవాలి. ఒక్కో మాస్క్‌ని ఒక్కో రోజు ధరించాలి. మాస్క్‌ తీసేశాక, దాన్ని ఒక బాక్సు/జిప్‌ బ్యాగ్‌లో భద్రపరచాలి. ఎవరూ తాకకుండా చూడాలి. అలా వరుసగా అయిదు మాస్క్‌లు అయిదు రోజులు ధరించాక... మొదటి రోజు వేసుకుని, పక్కన పెట్టిన దాన్ని మళ్లీ ఆరో రోజు ధరించొచ్చు. ఇలా ఒక్కో మాస్క్‌ని అయిదుసార్లు వాడొచ్చు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా డిస్పోజ్‌ చేయాలి.

ఇదీ చదవండి:

'కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు వాడొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.