'ఏసీ గదుల్లో నుంచి చూస్తే వాస్తవాలు ఎలా తెలుస్తాయ్..!' - అమరావతి గ్రాఫిక్స్ పై లోకేశ్ కామెంట్స్
అమరావతి గ్రాఫిక్సో... వాస్తవమో రాజధానిలో పర్యటిస్తే తెలుస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. వైకాపా నేతలకు సవాల్ విసిరారు. నిర్మించిన భవనాలు నిదర్శనంగా తాము చూపుతుంటే ఏసీ గదుల్లో కుర్చోన్న అమాత్యులు గ్రాఫిక్స్ అని ఎలా విమర్శిస్తారంటూ ప్రశ్నిస్తున్న లోకేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'ఏసీ గదుల్లో నుంచి చూస్తే వాస్తవాలు ఎలా తెలుస్తాయ్..!'
ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. నారా లోకేష్
ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Body:రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే అనుభవజ్ఞుడు కావాలని ప్రజలు పెద్ద కొడుకుగా నారా చంద్రబాబునాయుడు ను ఎన్నుకున్నారన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్లుగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నిలబెట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నారన్నారు. అనంతరం ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజలను కోరిన జగన్ మాత్రం అభివృద్ధి చేయకపోగా ఉన్నవాటిని తొలగిస్తున్నారని ఆరోపించారు.
Conclusion:ఇదేమని అడిగిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. హక్కుల కోసం నాయకులను ఏమైనా అంటే వారిపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. వారి సపోర్ట్ గా కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారన్నారు. నేను అంటున్నాను ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అన్నారు. ఇప్పుడు పోలీసులు ఎవరైనా కేసులు పెట్టండి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఎవరికైనా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.